Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మేరీ  క్రిస్మస్ వేడుకలు 

ఘనంగా మేరీ  క్రిస్మస్ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని రాజపేట తండా గ్రామపంచాయతీలోని  ఎబినైజర్ ప్రార్ధన మందిరంలో మంగళవారం మండల పాస్టర్స్ కమిటీ ఆధ్వర్యంలో మెర్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ముందుగా క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రేమ శాంతికి ప్రతీక ఏసుప్రభువు అని ప్రపంచంలోనే ఎక్కువ దేశాలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని తెలిపారు. ప్రజలు అన్ని మతాలను గౌరవించుకుంటూ సమాజంలోని వ్యక్తుల మధ్య ప్రేమ సంబందాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రములో ఆర్ ఐ పాండురంగారెడ్డి, జహురుద్దీన్ పాస్టర్ ప్రకాష్, అబ్రహం, గ్యార ప్రకాష్, మర్రిగూడ సర్పంచ్ వీరమళ్ల శిరీష లోకేష్, మండల పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -