Wednesday, December 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగంగాజలం కోసం మెస్రం వంశీయుల పయనం

గంగాజలం కోసం మెస్రం వంశీయుల పయనం

- Advertisement -

– మురాడి వద్ద సమావేశం
– సంప్రదాయ పద్ధతిలో పూజలు
– సెల్‌ఫోన్‌ వాడకం నిషేధం
– ఏడు రోజులు.. 210 కిలోమీటర్లు
నవతెలంగాణ-ఇంద్రవెల్లి

గిరిజనుల ఆరాధ్య దైవం.. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన రెండో అతిపెద్ద జాతర నాగోబా తోలిఘట్టం ప్రారంభ మైంది. మెస్రం వంశీయులు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ మురాడి వద్దకు చేరుకుని సమావేశమయ్యారు. పటేల్‌ పీఠాధిపతి మెస్రం వెంకట్‌ రావు చిన్ను, ఖాటోడ (పూజారులు) కోసు, కోసేరావ్‌, మెస్రం శేఖర్‌ ఆధ్వర్యంలో గంగాజలం కోసం వెళ్లే దారులపై చర్చించారు.

ఆచార సంప్రదాయాలకు పెద్ద పీఠ
ఈసారి గంగా జలం కోసం పయనించే మెస్రం వంశీ యులు ఆచార సంప్రదాయాలను పాటించాలని సూచిం చారు. సెల్‌ఫోన్‌ వాడకూడదని, తెల్ల దోతీ మాత్రమే ధరిం చాలన్నారు. బడి పిల్లలను కుటుంబీకులు తమ వెంట తీసుకుని రాకూడదని తీర్మానించారు. సంప్రదాయ పూజల అనంతరం గంగా జలం కోసం వెళ్లే ఖటొడ గౌరీ గ్రామానికి చెందిన (పూజారి) హనుమంతరావు వీపుకు తెల్లటి బట్టతో కలశంను కట్టి సాగనంపారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాగూడ బయలుదేరి రాత్రి బస చేస్తారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని చిలాటిగూడలో బసచేసి, 2026 జనవరి ఒకటిన గురువారం నార్నూర్‌ మండలంలోని మాన్కాపూర్‌లో బస చేస్తారు. 2న శుక్రవారం జైనూర్‌ మండలంలోని మామడలో బస చేసి, 3న శనివారం జైనూర్‌ మండలంలోని డబోలిలో బస, 4న ఆదివారం సిర్పూర్‌(యు) మండలంలోని ధనోరలో బస, 5న సోమవారం జన్నారం మండలంలోని ఇస్లాంపూర్‌లో బస, 6న మంగళవారం దస్తురాబాద్‌ మండలంలోని నర్సింగపూర్‌, 7న బుధవారం హస్తినమడుగులోని గోదావరికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి పవిత్ర గంగాజలాన్ని సేకరిస్తారు. 7న గంగాజలంతో తిరుగు ముఖం పట్టి జైనూర్‌ మండలంలోని పిట్టగూడా కటోడ ఇంట్లో బస చేస్తారు. అనంతరం చివరి రోజున 14న ఇంద్రవెల్లి మండలం ఇంద్రాదేవి వద్ద బస చేసి, కేస్లాపూర్‌కు సంక్రాంతి రోజు చేరుకుంటారు. మొత్తం ఏడు రోజులు సాగే ఈ ప్రయాణంలో 210 కిలోమీటర్ల నడక ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -