Tuesday, September 23, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రజలకి మరింత చేరువగా మెసేజ్ యువర్ ఎస్పీ

ప్రజలకి మరింత చేరువగా మెసేజ్ యువర్ ఎస్పీ

- Advertisement -

మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సాప్ నెంబర్ 6303922572
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

నేరుగా ఫిర్యాదు చేయలేనివారు, దూరప్రాంతాల్లో ఉన్న వారు పిర్యాదు చేయడానికి అందుబాటులోకి తీసుకవచ్చిన మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సప్ నెంబర్ 6303922572, డయల్ 100 సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకవచ్చిన మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సాప్ నంబర్ 6303922572, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ని ప్రజలు సద్వినియోగం చేసుకోని ఫిర్యాదులు చేయవచ్చని ఆయన వివరించారు.

మెసేజ్ యువర్ ఎస్పీ,డయల్ 100 ద్వారా జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా.. ఎలాంటి సమచారాన్ని అయిన క్షణాల్లో పోలీసు అధికారులకు చేరవేయవచ్చని అన్నారు. ప్రధానంగా ఫిర్యాదులు,నేరాలు,ఉమెన్ హారస్మెంట్స్, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలు,అక్రమ రవాణా, మొదలైన సమాచారం మెసేజ్ రూపంలో అందిస్తే వెంటనే స్పందించి ఆ పరిధిలోని డీఎస్పీ లు ఇన్స్పెక్టర్లు ,ఎస్సైల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమాచారం చేరవేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.ఎల్లవేళలా వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండేవిధంగా ఈ నెంబర్స్ తన పర్యవేక్షణలోనే ఉంటుందని ఎస్పీ  వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -