నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తాజాగా రాజీనామా చేశారు. వెంటనే ఆయన రాజీనామాను సీఎం మమత బెనర్జీ ఆమోదించారు. 13వ తేదీన జరిగిన ఘటనపై విచారణ కోసం ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజునే క్రీడాకారులకు మమత క్షమాపణలు చెప్పారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు .
అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మొదట అతడు కోల్‌కతా చేరుకున్నాడు. అయితే కోల్‌కతాలో మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షుకులు, మెస్సీ అభిమానులు విధ్వంసానికి దిగారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా నిలిచిపోయింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యల చేపట్టారు .



