Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమెస్సీ మానియా..

మెస్సీ మానియా..

- Advertisement -

హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి జట్ల మధ్య డిసెంబర్‌ 13న ఉప్పల్‌ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ రానున్నారు. 13న సాయంత్రం 4.15 గంటలకు రాహుల్‌ గాంధీ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఉప్పల్‌ మైదానానికి చేరుకోనున్నారు. ‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ మ్యాచ్‌కు టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని సూచించారు. 34 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -