ప్రధానితో భేటీ రద్దు
న్యూఢిల్లీ: ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ ప్రోగ్రాంలో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ సోమవారం ఢిల్లీలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం.. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. తన బృందంతో కలిసి మైదానంలోకి వెళ్లిన మెస్సీ ఐసిసి అధ్యక్షులు జై షాతో కలిసి టి20 ప్రపంచకప్ టికెట్ విడుదల చేశారు. ఆ తర్వాత ‘మినెర్వా అకాడమీ’కి చెందిన యువకులతో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సూరజ్, రొడ్రిగో డీపౌల్ పాల్గొన్న ఈ కర్యాక్రమంలో మెస్సీకి జై షా ప్రత్యేక బ్యాట్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ క్రికెట్ సంఘం(డిసిసిబి) అధ్యక్షుడు రోహన్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో అడిడాస్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న మెస్సీ టీమ్.. అనంతరం వాంతార వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా చివర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో మెస్సీ బృందం పాల్గొనాల్సి ఉండగా.. ప్రధాని సోమవారం ఉదయం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లడంతో ఆ కార్యక్రమంలో రద్దయ్యింది.



