Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌ మెట్రోకు 'హార్వర్డ్‌' గుర్తింపు

హైదరాబాద్‌ మెట్రోకు ‘హార్వర్డ్‌’ గుర్తింపు

- Advertisement -

ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హర్షం
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌) ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్‌ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్‌ను కేస్‌ స్టడీగా తీసుకొని, ‘హైదరాబాద్‌ మెట్రో- ఆలోచన నుంచి అమలు వరకు.. పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌’ అనే శీర్షికతో హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ జర్నల్‌లో పరిశోధనా పత్రం ప్రచురించింది. హార్వర్డ్‌ రిపోర్ట్‌ ప్రకారం, హెచ్‌ఎంఆర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. 2006లో ఎన్వీఎస్‌ రెడ్డి హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ ఐడియా తెచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంది, భూసేకరణ సమస్యలు, మేటాస్‌ కంపెనీ ఫెయిల్‌ అవ్వడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాజకీయ ఒడిదుడుకులు, ప్రజల నుంచి ప్రొటెస్ట్‌లు, ఆర్థిక ఇబ్బందులు.. అయినప్పటికీ, ఎన్వీఎస్‌ రెడ్డి స్ట్రాటజిక్‌ లీడర్‌షిప్‌, బోల్డ్‌ డెసిషన్స్‌, సమర్థవంతమైన ప్లానింగ్‌తో 2017లో మొదటి ఫేజ్‌ విజయవంతంగా పూర్తయింది. 64కి.మీ. పొడవుతో 57 స్టేషన్లు మూడు కారిడార్‌లలో నిర్మించారు. దీని వల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ బాగా తగ్గింది, కాలుష్యం కంట్రోల్‌ కావడంతో పాటు ప్రజలకు సురక్షితమైన రవాణా లభించింది. స్టేషన్ల చుట్టూ కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌తో ఆర్థిక వృద్ధి కూడా సాధ్యమైంది. హార్వర్డ్‌ రిపోర్ట్‌లో మొదటి ఫేజ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలతో రెండవ దశ సైతం విజయవంతం అవుతుందని చెప్పారు. ఇంతకు ముందు ఐఎస్‌బీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలు కూడా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సక్సెస్‌ స్టోరీని పరిశోధనా పత్రాలుగా పబ్లిష్‌ చేశాయి. ఇప్పుడు హార్వర్డ్‌ గుర్తింపుతో హెచ్‌ఎంఆర్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆదర్శంగా నిలిచిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -