No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంమిస్‌ వరల్డ్‌ వేడుకలకు 'మెట్రో రైల్‌' విస్తృత ప్రచారం

మిస్‌ వరల్డ్‌ వేడుకలకు ‘మెట్రో రైల్‌’ విస్తృత ప్రచారం

- Advertisement -

– మెట్రో మూడు కారిడార్లలో స్టేషన్లు, స్తంభాలపై ఫ్లెక్సీలు
– స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద సంప్రదాయ చిత్రాలతో కూడిన ఆర్చ్‌ల ఏర్పాటు
నవతెలంగాణ-సిటీబ్యూరో

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ వేడుకల్లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కూడా నేను సైతం అంటూ భాగస్వామ్యం అయ్యి విస్తృత ప్రచారం చేపట్టింది. తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాల ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రపంచ సుందరీమణులను తెలంగాణకు పరిచయం చేసేలా అటు హైటెక్‌ సిటీ నుంచి నాగోల్‌ వరకు ఇటు మియాపూర్‌ నుంచి ఎల్‌బీ నగర్‌ వరకు పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న మెట్రో రైలింగ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. మెట్రో రైళ్లలో స్క్రీన్‌ల పైన, స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో కాన్‌ కోర్స్‌ల్లో ప్రకటనల బోర్డులపైనా మిస్‌ వరల్డ్‌ వేడుకలను ప్రతిబింబించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఇక రహదారుల నుంచి స్టేషన్లలోకి వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద సంప్రదాయ చిత్రాలతో కూడిన ఆర్చ్‌లను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు మరింత వన్నె తెచ్చింది. ప్రతిరోజూ దాదాపు 4.5లక్షల నుంచి 5లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు మెట్రోరైల్‌ చేరవేస్తున్నదనీ, ఈ ప్రతిష్టాత్మకమైన మిస్‌ వరల్డ్‌ కార్యక్రమం ద్వారా తెలంగాణ వారసత్వ సంపదను నలుగురికీ తెలియజేసే బృహత్‌ కార్యక్రమంలో పాల్గొంటోందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆధ్యాత్మిక సంరంభం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం, ఐక్యరాజ్య సమితి గుర్తించిన వారసత్వ ప్రాంగణం రామప్ప దేవాలయం, తెలంగాణ సంప్రదాయాలకు కీర్తి పతాకగా నిలిచిన బోనాలు, బతుకమ్మ, చార్మినార్‌ వంటి విశేషాలతో కూడిన ఆకర్షణీయ దృశ్యాలను ‘మెట్రో రైల్‌’ ఈ వేడుకల సందర్భంగా మరింత విస్తృత ప్రచారం కల్పించిందని మెట్రో ఎండీ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad