- Advertisement -
నవతెలంగాణ-సిటీబ్యూరో
గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది. మెట్రో రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
- Advertisement -