న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో సర్వీసుల పొడిగింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిసెంబర్ 31వ తేదీ బుధవారం హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్టు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజూ రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడిచే మెట్రో రైళ్లు, నూతన సంవత్సరం సందర్భంగా అదనపు సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు. రాత్రి చివరి మెట్రో రైళ్లు అన్ని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయలు దేరనున్నాయని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మెట్రో రైళ్లు, స్టేషన్లలో అదనపు సిబ్బంది, పోలీసు బలగాలను మోహరించనున్నట్టు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుని సురక్షితంగా ప్రయాణించా లని, నిబంధనలను పాటించాలని సూచించారు.
నేటి అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



