Friday, December 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌పై మెక్సికో 50 శాతం టారిఫ్‌లు

భారత్‌పై మెక్సికో 50 శాతం టారిఫ్‌లు

- Advertisement -

ట్రంప్‌ బాటలో దక్షిణాసియా దేశాలపై సుంకాలు
న్యూఢిల్లీ :
దక్షిణాసియా దేశాలపై మోక్సికో వాణిజ్య యుద్ధం ప్రకటించింది. భారత్‌పై అమెరికా అధిక సుంకాల ప్రతికూలత కొనసాగుతుం డగానే అదే బాటలో మెక్సికో టారిఫ్‌లను పెంచింది. భారత్‌ సహా పలు దక్షిణాసియా దేశాలపై సుంకాలు విధిస్తూ మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికన్‌ సెనెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. కనీసం 5 శాతం నుంచి 50 శాతం వరకు దిగుమతి టారిఫ్‌లను పెంచే బిల్లుకు మెక్సికో సెనెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 76 మంది అనుకూలంగా, ఐదు మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కొత్త టారిఫ్‌లు నూతన సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. దుస్తులు, లోహాలు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ఉక్కు సహా అనేక ఉత్పత్తులపై వీటి ప్రభావం పడనుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. స్థానిక తయారీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు క్లాడియా ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -