Friday, May 23, 2025
Homeఆటలుమిచెల్‌ మార్ష్‌ శతకం..

మిచెల్‌ మార్ష్‌ శతకం..

- Advertisement -

గుజరాత్‌పై లక్నో గెలుపు
అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. లక్నో విధించిన 236 పరుగలు చేధనలో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో 33 పరుగులతో విజయం సాధించింది. లక్ష్య చేధనలో గుజరాత్‌ జట్టులో షారుఖ్‌ఖాన్‌ అర్థ సెంచరీతో (57 పరుగులు, 29 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు లక్ష్యానికి తగినట్లుగా బ్యాటింగ్‌ చేయలేకపోయారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్‌ మూడు వికెట్లు సాధించాడు. ఆయుష్‌ బదోని, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అకాశ్‌ మహరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఒక్క వికెట్‌ దక్కించుకున్నారు. దీంతో గుజరాత్‌ ఓటమి చెందింది. అయితే గుజరాత్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ 18 పాయింట్లతో టాప్‌లో ఉంది. లక్నో ఈ విజయంతో మొత్తం 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది.
గురువారం మ్యాచ్‌లో ముందుగా గుజరాత్‌ ఫిల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (117, 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. నికోలస్‌ పూరన్‌ (56, 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు.నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్లు మార్‌క్రమ్‌ (36), మార్ష్‌ తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించగా..తరువాత మార్ష్‌, పూరన్‌ రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ష్‌ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్‌ బౌలర్లలో అర్షద్‌, సాయికిశోర్‌ చెరో వికెట్‌ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -