Tuesday, November 18, 2025
E-PAPER
Homeజిల్లాలుశ్రమ దోపిడికి గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు 

శ్రమ దోపిడికి గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు 

- Advertisement -

బడ్జెట్ కేటాయింపులు పెంచాలి 
సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాటాలు అధికార మార్పిడి జరిగిన సమస్యలు పరిష్కారం కాలే 
బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒక్కటే 
ప్రయివేటీకరణ వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు 
ఎర్రజెండా నాయకత్వంలో జరిగే పోరాటాలే మార్గం 
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ 
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ 4వ మహాసభల్లో ప్రారంభం ఉపన్యాసం 
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 

మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు పోరాటాల కాలమని, ఎర్రజెండా నాయకత్వంలో జరిగే పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని కామ్రేడ్ రంజన్ నిరులా నగర్ లో జరుగుతున్న తెలంగాణ మధ్యాహ్న భజన పథకం కార్మికుల యూనియన్ నాలుగో మహాసభలు రెండో రోజుకు చేరాయి. ముందుగా సీనియర్ వర్కర్ వెంకట నర్సమ్మ జెండావిష్కరణ చేశారు. అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలగుడు భాస్కర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఆ పోరాటాలకు 4వ రాష్ట్ర మహాసభ దిశా నిర్దేశం చేయనుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఆందోళన సందర్భంగా ప్రతిపక్షాల్లో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం కూడా అధికారంలోకి వచ్చిన అమలుకు నోచుకోవడం లేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒకటేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కోత విధించిందన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. కనీస వేతన రూ.26వేల వేతనం ఇవ్వాల్సి ఉన్న ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని విమర్శించారు. హామీలు ఫుల్.. అమలు నీల్ అన్నట్టుగా ప్రభుత్వాల వైఖరి కనిపిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలు సైతం అమలకు నోచుకోవడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెరగడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిలివేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ పథకానికి నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు మారాలని డిమాండ్ చేశారు. ఈ స్కీంను రక్షించుకునేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలన్న నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  స్వచ్ఛంద సంస్థలకు ఇస్తే పోరాటాల ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో అక్షయపాత్రని అడ్డుకున్న ఏకైక సంఘం సీఐటీయూ మాత్రమేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అమలులో భాగంగానే మధ్యాహ్నం భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించిందన్నారు.

రైల్వే, గనులు, ఖనిజాలు, ఎయిర్ పోర్ట్, ఎల్ఐసిల వంటి సమస్యలను ప్రైవేటుపరం చేసిందని, ఇప్పుడు పేదలకు కుటుంబాలకు చెందిన పిల్లలకు కడుపు నింపుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం కాజేయాలని చూస్తుందన్నారు. అందుకే పని గంటల విధానాన్ని పెంచుకునేందుకు కేంద్రం ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరణ తెలిపాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాలకు పోరాటాల ద్వారానే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ఈ రాష్ట్ర మహాసభలు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమ, రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా అధ్యక్షులు రుద్ర కుమార్, జిల్లా కోశాదికారి కవిత, జిల్లా ఉపాధ్యక్షులు కిషన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లేశ తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -