Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రమ దోపిడీకి గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు

శ్రమ దోపిడీకి గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు

- Advertisement -

– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విధానాలు ఒక్కటే : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. భవిష్యత్తు పోరాటాల కాలమని, ఎర్రజెండా నాయకత్వం లో జరిగే పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని కామ్రేడ్‌ రంజన్‌ నిరులా నగర్‌లో జరుగుతున్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలు మంగళవారం కొనసాగాయి. ముందుగా యూని యన్‌ సీనియర్‌ నాయకులు వెంకట నర్సమ్మ జెండావిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. కార్మికుల పట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విధానాలు ఒకటేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కోత పెట్టడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న బిల్లులను సైతం విడుదల చేయడం లేదన్నారు. ‘హామీలు ఫుల్‌.. అమలు నిల్‌’ అన్నట్టుగా ప్రభుత్వాల వైఖరి కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఈ స్కీంను రక్షించుకునేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో అక్షయపాత్రని అడ్డుకున్న ఏకైక సంఘం సీఐటీయూ మాత్రమేనని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు కడుపు నింపుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం కాజేయాలని కేంద్రం చూస్తోందన్నారు.
ఈ మహాసభలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, జిల్లా అధ్యక్షులు రుద్రకుమార్‌, జిల్లా కోశాదికారి కవిత, జిల్లా ఉపాధ్యక్షులు కిషన్‌, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లేశం, వివిధ జిల్లాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -