నవతెలంగాణ – జుక్కల్
హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముందు ధర్నా కార్యక్రమం బుధవారం ఆగస్టు 2025న తలపెట్టిన కార్యక్రమానికి జుక్కల్ సిఐటియు నాయకుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని అన్ని మండలాల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తరలి వెళ్లారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్టు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తెలిపారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని మిడ్ డే మిల్స్ కార్మికులు అన్నారు . ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు సురేష్ గొండ మాట్లాడుతూ ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్లిన మద్నూర్. డోంగ్లి. జుక్కల్. మండలాల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, సిఐటియు జిల్లా నాయకులు సురేష్ గొండ, వీరికి మద్దతు తెలుపుతూ మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES