నవతెలంగాణ – కంఠేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనీ ఆ సంఘం కార్యనివాహక అధ్యక్షులు కొండ గంగాధర్ డిమాండ్ చేశారు. సి ఐ టీ యూ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా మధ్యాహ్నం భోజనం పేద పిల్లలకు అప్పులు చేసి వంట వండి పెడుతున్నారని తెలిపినారు. కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ప్రభుత్వం పేద పిల్లల ఆరోగ్య గురించి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పిల్లలకు కావలసిన నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే అందించాలని ఆయన డిమాండ్ చేసినారు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు కనీసం పదివేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో జక్కం సుజాత, ఎల్లయ్య ,నాగమణి, స్వప్న, స్వరూప, దామ నాగమణి, సాయవ్వ ,నర్సమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.