Sunday, July 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూరప్‌ను వలసలు నాశనం చేస్తున్నారు

యూరప్‌ను వలసలు నాశనం చేస్తున్నారు

- Advertisement -

ట్రంప్‌ హెచ్చరిక
ఎడిన్‌బర్గ్‌
: అవకాశం లభించిన ప్రతి సందర్భంలో వలసలపై తీవ్ర వ్యాఖ్యలు చేసే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. యూరప్‌ పర్యటనలో భాగంగా శనివారం స్కాట్లాండ్‌ చేరుకున్న ఆయన విమానం దిగిన తరువాత మీడియాతో మాట్లాడారు. వలసల ప్రవాహం యూరప్‌ను నాశనం చేస్తోంది అని హెచ్చరించారు. వ్యవస్థను సరిచేసుకోకపోతే ఇక యూరోప్‌ మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు. ”వలసల విషయంలో మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే యూరప్‌ మీ చేతుల్లో ఉండదు. మీ వ్యవస్థను కట్టుదిట్టంగా నడిపించండి. లేదంటే మీరు యూరప్‌ను కోల్పోతారు”
అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు.
‘యూరప్‌లో, ముఖ్యంగా చాలా దేశాల్లో జరుగుతున్న ఈ భయంకరమైన దండయాత్రను (వలసల ప్రవాహాన్ని) మీరు వెంటనే ఆపాలి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ట్రంప్‌ తండ్రి ఫ్రెడ్‌ ట్రంప్‌, తల్లి మేరీ ఆన్‌ మెక్‌లియోడ్‌ ఇద్దరూ యూరప్‌ నుంచే అమెరికాకు వలస వచ్చారు. అయితే ఐక్యరాజ్యసమితి 2020 అంచనాల ప్రకారం, దాదాపు 87 మిలియన్ల వలసదారులు యూరప్‌లో నివసిస్తున్నారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కఠినమైన వలస వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద వలసదారుల బహిష్కరణ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటివరకు వేలాది మందిని బహిష్కరించారు. అయితే, ఆయన కఠినమైన వలస విధానం ప్రపంచంలోనే అత్యధిక వలస జనాభా కలిగిన అమెరికాలో విస్తృత నిరసనలకు దారితీసింది.
ట్రంప్‌ యూరప్‌ పర్యటన
యూరప్‌ పర్యటన సందర్భంగా బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌తో సమావేశాలు నిర్వహించనున్నారు ట్రంప్‌. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో కీర్‌ స్టార్మర్‌తో జరిగే సమావేశం సమావేశం వేడుకగా ఉంటుందని ఆయన అన్నారు. ఇది ఇద్దరికీ గొప్ప విషయమని చెప్పారు. ఆ తర్వాత వీకెండ్‌లో స్కాట్లాండ్‌ పశ్చిమ తీరంలో ఉన్న తన టర్న్‌బెర్రీలో ట్రంప్‌ బస చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -