మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ – పరకాల
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అసమర్థ పాలనపై విరక్తి చెంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ వైపు క్యూ కడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, 18వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, యువజన కార్యకర్తలు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నాయకత్వ లోపంతో ఆ పార్టీ రోజురోజుకు పతనం అవుతోందని విమర్శించారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాము చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని పేర్కొన్నారు.తాజా చేరికలతో పరకాల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ మరింత బలపడిందని, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో..
ఒక్కటవ వార్డు నుండి దుబాసి రవీందర్, మధు, స్వరూప, ఒంటేరు జంపయ్య, సాగర్, రాజకుమార్, బొచ్చు వినయ్, పైండ్ల రవి, శంకర్, పున్నం సంపత్, నాగరాజు, వైనాల సురేష్.18వ వార్డు నుండి యూత్ నాయకులు ఎం. సృజన్ కుమార్, ఏ. శివ తేజ, రవి చందర్, రాజు, సాయి, భాను, చంటి, విక్కి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అబ్సర్వర్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిపెల్లి వాసుదేవ రెడ్డి, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



