Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మంగళవారం (జులై 22) ఉదయం ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని స్వల్పంగా భూకంపం కంపించిం‍ది. స్వల్పంగా కంపనలు గుర్తించినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపానికి హర్యానాలోని ఫరిదాబాద్ ప్రాంతం కేంద్రంగా నమోదైంది.

భూకంపం కేంద్ర బిందువు అక్షాంశం 28.29 డిగ్రీలు ఉత్తరంగా, రేఖాంశం 72.21 డిగ్రీలు తూర్పుగా నమోదు అయింది. భూమి ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. భూకంపం వల్ల ఎక్కడా ప్రజలందరిలో ఆందోళన లేనప్పటికీ, కొద్దిసేపు ఇంటి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనలు తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో ఏవిధమైన నష్టం సంభవించలేదు. సాధారణంగా 3.0 – 4 తీవ్రతకు సంబంధించిన భూకంపాలు సురక్షితమైనవే కావడంతో అధికారులు ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -