హిమాచల్‌తో హైదరాబాద్ రంజీ మ్యాచ్
నడాన్ : చామ మిలింద్ (94 నాటౌట్, 116 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. హిమాచల్‌ప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో మిలింద్ ఆదుకోవటం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో గట్టెక్కె ప్రయత్నం చేస్తోంది. తన్మయ్ (33), అభిరాత్ (4), రాహుల్ (11), హిమతేజ (11), వరుణ్ (14), రాడేశ్ (26), రోహిత్ (28) నిరాశపరచటంతో 127/6తో పతనావస్థలో కూరుకున్న హైదరాబాద్‌ను మిలింద్ ఆదుకున్నాడు. తనయ్ త్యాగరాజన్ (28), నిశాంత్ (16 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి హైదరాబాద్ 71 ఓవర్లలో 274/8తో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 44 పరుగుల వెనుకంజలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 318/10 పరుగులు చేసింది. తనయ్ త్యాగరాజన్ (4/80), రోహిత్ రాయుడు (3/51) రాణించారు.



