Thursday, May 15, 2025
Homeజాతీయంరాష్ట్రపతితో సైనికాధికారుల భేటీ

రాష్ట్రపతితో సైనికాధికారుల భేటీ

- Advertisement -

– ఆపరేషన్‌ సిందూర్‌పై బ్రీఫింగ్‌
న్యూఢిల్లీ:
ఆపరేషన్‌ సిందూర్‌ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సైనికాధికారులు వివరించారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సిడిఎస్‌) జనరల్‌ అనీల్‌ చౌహాన్‌, త్రివిధ దళాల అధిపతులతో కలిసి బుధవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళ సిబ్బంది చీఫ్‌ ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌, నావికా బలగాల అధిపతి ఆడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠిలతో కలిసి జనరల్‌ అనీల్‌ చౌహాన్‌ రాష్ట్రపతికి మిలటరీ అపరేషన్ల గురించి వివరించారని రాష్ట్రపతి భవన్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. సాయుధ బలగాల అంకిత భావం, నిబద్ధతలను రాష్ట్రపతి ప్రశంసించారని ఆ పోస్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -