డబ్బా పాలు వద్దు తల్లిపాలే శ్రేయస్కరం.. సూపర్వైజర్ ఎన్. చంద్రకళ
నవతెలంగాణ – దుబ్బాక
అప్పుడే పుట్టిన శిశువులకు ముర్రుపాలు పట్టించాలని, అది మొట్టమొదటి ‘ వ్యాధి నిరోధక టీకా’ గా పనిచేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్. చంద్రకళ అన్నారు. శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరమని డబ్బా పాలు పట్టవద్దని, బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఎన్నో విటమిన్లు, పోషకాలు తల్లిపాలలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ – 2, మున్సిపల్ పరిధి చేర్వాపూర్ లోని అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఏఎన్ఎంలు పుష్ప, బాలనర్సవ్వ తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లులు అపోహలు వీడి తమ బిడ్డలకు తల్లిపాలనే త్రాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుజాత, శిరీష, ఆశాలు, బాలింతలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.
ముర్రుపాలు.. వ్యాధి నిరోధక టీకాతో సమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES