Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్బైక్ నడిపి కొత్వాల్ కు చిక్కిన మైనర్లు

బైక్ నడిపి కొత్వాల్ కు చిక్కిన మైనర్లు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని రెండు చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇద్దరు యువకులు హెల్మేట్ లు ధరించి సుఖ ప్రదమైన ప్రయాణం చేయండని ప్లకార్డులతో ప్రచారం చేపట్టారు. మైనార్టీ కుడా తీరని ఇద్దరు యువకులు ఇలా స్వచ్చంధ సేవ చేస్తుండటం అందరు ఆశ్చర్యంగా చూసారు. ఆదివారం జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రంలో డజన్ ట్రాఫిక్ సర్కిల్ లు ఉండగా ఇద్దరే యువకులు స్వచ్చంధ సంస్థల ఎన్ జిఓ ల ప్రమేయం లేకుండా రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రధానంగా తల భాగం కాపాడుకోవాడానికి హెల్మెట్ ధరించాలని రెండే ఏరియాలలో ప్రచారం చేయడాన్ని వింతగా చూసారు. ఐతే ఇద్దరు మైనర్ యువకుల స్వచ్చంధంగా ప్రచారం కాదది పోలీస్ బాస్ మార్క్ పనిష్మెంట్ (మార్పు) ప్రయత్నమని తెలిసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలిసారి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి స్వచ్చంధంగా ప్రజలకు అవగాహన కల్పించేయడంలో అంతర్యం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. శనివారం రాత్రి ఇద్దరు యువకులు (మైనర్ లు) బైక్ పై రయ్యుమని దుసుకుపోతుండా అటుగా వెలుతున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చూసారు. ఉన్నపళంగా ఇద్దరు మైనర్ లు బైక్ ను స్పీడ్ గా నడుపుతున్నారని గుర్తించి వారికి సామాజిక సేవ బదులు హెల్మేట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని అవగాహన కల్పించాలని ఆదేశించారు.నిజామాబాద్ పోలీస్ కొత్వాల్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోతురాజు సాయి చైతన్య నగరంలో శాంతి భధ్రతలకు ప్రాధాన్యత ఇస్తు మార్పు కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భధ్రతల విషయంలో రాజీ లేకుండా పని చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ డ్రైవ్ టార్గెట్ లను నిర్దేశించారు. అదే విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ లేకుండా నడిపితే ఏకంగా చెక్ లిస్ట్ లు పెట్టి సీజ్ చేయించారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్ లకు బైక్ లు ఇచ్చిన తల్లీ ధండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి గాని వదలటం లేదు. ఇటీవల బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం రోడ్డు ప్రమాదాలకు మైనర్ లు కారణాలు ఐతే తల్లిదండ్రులకు శిక్షలు అనుభవించేలా కేసులు నమోదు చేశారు. ఐనప్పటికి మార్పు రాకపోవడంతోనే మైనర్ లపై కేసుల నమోదుతో వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని వారి చేతనే ప్లకార్డుల ప్రదర్శన చేయించడం ద్వార యువతలో వారి తల్లిదండ్రులలో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అవగాహన కార్యక్రమాలు చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -