Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి 

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి 

- Advertisement -

సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులతో వెట్టిచాకిరి  చేయించుకుంటున్నారని ఆరోపించారు. వారికి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు.

వర్కర్లకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలుపరచాలన్నారు. మున్సిపల్ వర్కర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని ముఖ్యంగా చెప్పులు, గ్లౌజులు సబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్కర్ల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రతినెలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని సకాలంలో బెల్లం కొబ్బరి నూనె, బ్రెస్ లు ఇవ్వాలని కోరారు. అనంతరం అధ్యక్షుడిగా వెంకన్న ప్రధాన కార్యదర్శిగా మోహన్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -