సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు
నవతెలంగాణ – కట్టంగూర్
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారికి జాబ్ చార్ట్ ను ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, టార్గెట్లను చేయాలంటూ ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ,జిల్లా కమిటీ సభ్యురాలు చెరుకు జానకి,యూనియన్ మండల అధ్యక్షురాలు చెగోని ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భూపతి రేణుక, అంతటి పద్మావతి, ఉట్కూరి పార్వతమ్మ,, గదపాటి భారతి,బొజ్జ సైదమ్మ,పెంజర్ల అనిత, పోలిశెట్టి పుష్పాంజలి, రేణుక,సునీత,సంధ్య, రేణుక,శోభ,నరసమ్మ ఉన్నారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES