అక్రమమట్టి ట్రాక్టర్ పారిపోగా, జెసిబి సీజ్
మా భూమి ఆక్రమించి అక్రమముగా మట్టి అమ్మకం
రెవెన్యూ అధికారులకు బాధితులు ఫిర్యాదు
మా కుమారుడుపై అక్రమ మట్టి తోలకాల నిర్వహకుడు ఉమ్మనేని రమేష్ దాడి
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలో ఈ సంఘటన జరిగింది. మా భూమిని ఆక్రమించి మా పైనే మట్టి అక్రమ తోలకం యజమాని దాడి చేశాడని, అదేవిధంగా మా భూమిని ఆక్రమించి మా భూమిలో గల మట్టిని అక్రమంగా ఇతర వ్యక్తులకు ఓ వ్యక్తి అమ్ముకొని మా పైనే దాడులు చేస్తున్నాడని కొంతమంది బాధ్యతలు శుక్రవారం మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కుమ్మరి అబ్రహం, కుమ్మరి ప్రభాకర్, కుమ్మరి వీరయ్య, కుమ్మరి కుమారి తెలిపిన వివరాల ప్రకారం…
చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన తమకు బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 446లో ఒక ఎకరం పొలం ఉందని తెలిపారు. ఆ భూమి మా తండ్రి అయినా కుమ్మరి స్వామి దాస్ నుంచి మాకు వారసత్వంగా వచ్చిందని తెలిపారు. అయితే మా గ్రామానికి చెందిన మాతంగి ఫ్రాన్సిస్ మా భూమిని ఆక్రమించుకొని గత కొంతకాలంగా మమ్మలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం మా భూమిని ఆక్రమించుకున్న ఫ్రాన్సిస్ అందులో గల మట్టిని ఇతరులకు అమ్ముకున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి తాము మా పొలం వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉమ్మనేని రమేష్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. మా పొలంలో మట్టి ఎందుకు తోలుతున్నారని కుమ్మరి పవన్ పొలంలో ఉన్న వారిని అడుగుతుండగా ఉమ్మనేని రమేష్ వచ్చి పవన్ పై దాడి చేశారని తెలిపారు.
పవన్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని కూడా ఉమ్మనేని రమేష్ బలవంతంగా లాక్కొని తీసుకొని పోయినట్లు తెలిపారు. మళ్లీ పొలం వద్దకు వస్తే చంపుతామని రమేష్ బెదిరించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాము బోనకల్ మండల తహసిల్దార్ రమాదేవికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో మండల తహసిల్దార్ స్పందించి గిర్దావర్ షేక్ వహిదా సుల్తానా ను సంఘటన స్థలానికి పంపించినట్లు తెలిపారు. అయితే తాము గిర్దావర్ సంగనా స్థలానికి వెళ్లిన కొద్దిసేపటికి మైనింగ్ అధికారులు కూడా వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అక్కడే జెసిబి, ఒక ట్రాక్టర్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ట్రాక్టర్ ను ఫోటో తీస్తుండగా అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఇప్పుడు ఒక జెసిబి ట్రాక్టర్ వెళ్ళిపోయింది. మైనింగ్ అధికారులు జెసిబిని సంఘటన స్థలం నుంచి తీసుకువచ్చి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. జెసిబిని తాము సీజ్ చేస్తున్నట్లు మైనింగ్ అధికారి తమకు తెలిపినట్లు బాధితులు తెలిపారు. రెవిన్యూ అధికారులు స్పందించి తమ భూమిని తమకు అప్పగించాలని బాధితులు కోరారు.



