Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్దొడ్డు బియ్యం సరఫరాపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

దొడ్డు బియ్యం సరఫరాపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

- Advertisement -

విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదు
గురుకులాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం
నవతెలంగాణ – కరీంనగర్ 

పేద, ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల చదువులు, ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడబోమని, గురుకులాలను రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపెళ్లి మండలం చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించిన మంత్రి, ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ దొడ్డు బియ్యం వాడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన అన్నం అందించాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యం పై మండిపడ్డారు. గత 15 రోజులుగా దొడ్డు బియ్యం వండుతున్నారని ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయడంతో, మంత్రి వెంటనే కరీంనగర్ డి.ఎస్.ఓ.కు ఫోన్ చేసి వివరణ కోరారు. సరఫరా చేసిన దొడ్డు బియ్యాన్ని తక్షణం మార్చాలని ఆదేశించారు. అనంతరం సివిల్ సప్లయిస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్‌తో మాట్లాడి, రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు దొడ్డు బియ్యం సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై ఎలాంటి ఉపేక్ష ఉండదు అని హెచ్చరించిన మంత్రి, గురుకులాల్లో మెస్ పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనపు వాటర్ ప్లాంట్, స్టీల్ వంట పాత్రలు వారంలో ఏర్పాటు చేయాలని, స్కూల్ ప్రహరీ నిర్మాణం, క్యాంపస్ ఎలెక్ట్రిషియన్ నియామకం వారం రోజుల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. పిల్లల క్రీడా సదుపాయాల కోసం బాస్కెట్ బాల్ కోర్ట్, మైదానం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి, విద్యార్థుల సమస్యలు తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. భోజన సమయానికి విద్యార్థులతో కూర్చుని అన్నం రుచి చూసిన ఆయన, విద్యార్థుల సంక్షేమం మా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img