Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవి నాయక్‌ మరణంపై విచారణకు మంత్రి దామోదర ఆదేశం

రవి నాయక్‌ మరణంపై విచారణకు మంత్రి దామోదర ఆదేశం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా ఈర్లపల్లి తండాకు చెందిన రవి నాయక్‌ మరణానికి సకాలంలో చికిత్స అందకపోవడమే కారణం అని పత్రికల్లో వచ్చిన వార్తలపై మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని మంత్రి సూచించారు. నిజమేంటో తేల్చి, ఎవరి దైనా నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి ఆదే శాల మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్లు డాక్టర్‌ రాజారావు, డాక్టర్‌ నాగేందర్‌లతో కమిటీ ఏర్పాటు చేస్తూ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వ్యవహరించినట్టు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -