నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ఉదయం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఇతర వైద్యులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. సౌమ్యకు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.
ఆమె పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత తమదేనన్నారు.రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, దానికి ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆమె సంపూర్ణంగా కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఆమె కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీనిచ్చారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. నిందితులపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేయించామని తెలిపారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



