నవతెలంగాణ – హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం పొందాలన్నారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణప్రాంతంలో 500 ఇండ్లు నిర్మించాలని తెలిపారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
- Advertisement -