Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కట్టంగూర్ సర్పంచ్ ను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి

కట్టంగూర్ సర్పంచ్ ను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కట్టంగూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన ముక్కాముల శ్యామలశేఖర్,వార్డు సభ్యులు ఏకుల సుజాతసైదులు, పురకం శ్రీనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపి సన్మానించారు. మంత్రిని పాలకవర్గ సభ్యులు గురువారం నల్లగొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధి కొరకు సహకరించాలని మంత్రి వెంకటరెడ్డిని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్, కట్టంగూర్ టౌన్ అధ్యక్షులు చెరుకు యాదగిరి, మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు బోడుపల్లి సైదులు, మహిళ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు బోడుపల్లి జానకమ్మ,మండల మహిళ అధ్యక్షులు మేడి ఈశ్వరమ్మ,దొరపల్లి పద్మ, యువజన కాంగ్రెస్ నాయకులు మేడి విజయ్, యర్కల లక్ష్మణ్ గౌడ్,ఊట్కూరి రాజశేఖర్,మాతంగి నాగార్జున,ఊట్కూరి సాయి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -