Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండా సురేఖ

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండా సురేఖ

- Advertisement -

నవతెలంగాణ- ఐనవోలు
భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్‌ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి కొండ సురేఖకు, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్యే పరిశీలించారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా ఐనవోలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన బస్‌ బస్టాండ్‌ను ప్రారంభించి.. బస్సులో మంత్రి, ఎమ్మెల్యే ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం సందర్శకుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడారు. భోగి పర్వదినం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ మాజీ చైర్మెన్‌ మార్నెనీ రవీందర్‌రావు, ఆలయ కమిటీ చైర్మెన్‌ కమ్మగోని ప్రభాకర్‌ గౌడ్‌, ఆలయ ఈవో సుధాకర్‌, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -