Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ను కలిసిన మంత్రి, ఎంపీ

నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ను కలిసిన మంత్రి, ఎంపీ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ మీనేష్ సి షా ను తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య, తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  గుత్త  అమిత్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి లు కలిసి సంబంధించిన ఆర్థిక పరిపాలన విషయాలపై సమీక్ష నిర్వహించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. డెయిరీ యూనియన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, డెయిరీ యూనియన్‌ను మళ్లీ ఆరోగ్యకరమైన, స్థిరమైన కార్యకలాపాల దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన సహకారం అందించాలని ఎన్ డి  డి బి కోరగా, చైర్మన్  సానుకూలంగా స్పందించి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

బ్యాంకులకు ఉన్న బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ చెల్లింపులు క్లియర్ చేయడం, డెయిరీ కార్యకలాపాలను పునరుద్ధరించడం, సంస్థ పరిపాలనను బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, డెయిరీ స్థిరీకరణ, పునరుద్ధరణ కోసం ఎన్ డి డి బి  ప్రతినిధులు కొన్ని వ్యూహాత్మక ప్రతిపాదనలు సూచించారు. ఈ ప్రతిపాదనలపై రాబోయే వారాల్లో సంయుక్తంగా పనిచేసి నార్ముల్ డెయిరీని దీర్ఘకాలికంగా స్థిరపరిచి, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడుతూ తెలంగాణ సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -