Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

- Advertisement -

– మున్సిపల్ చైర్మన్ గా దండి లక్ష్మి , వైస్ చైర్మన్ గా చిత్తరి పద్మ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల కౌన్సిలర్లు పొందిన నూతన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన నూతన  పాలకవర్గానికి  మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గంతో ఆర్డీవో రామ్మూర్తి  ప్రమాణ స్వీకారం చేపించారు. అనంతరం  మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధి కాంక్షించి నాపై విశ్వాసం ఉంచి   కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను మున్సిపల్ పాలక వర్గంగా గెలిపించారు.

హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ చుట్టు ఉన్న నాలుగు జిల్లా కేంద్రాల మాదిరి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల ముందే రాజకీయాలు. ఎన్నికల తరువాత రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి చేస్తాం  అన్ని పార్టీలు సహకరించాలన్నారు.అందరం కలిసి హుస్నాబాద్ లో మౌలిక సదుపాయాలు,వారి జీవన స్థితి గతులు మెరుగుపరిచి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుందన్నారు..విద్య , వైద్యం ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి, శానిటేషన్ , డ్రింకింగ్ వాటర్ , స్ట్రీట్ లైట్స్ మున్సిపల్ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామన్నారు. హుస్నాబాద్ అభివృద్ధి లో ఒక మోడల్ రూపొందిస్తాం శాసన సభ్యుడిగా పాలక వర్గానికి అండగా ఉంటానన్నారు.

మున్సిపల్  చైర్ పర్సన్ దండి లక్ష్మీ మాట్లాడుతూ.. హుస్నాబాద్ లో ఉన్న 20 వార్డుల్లో అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యలు మంత్రి  దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -