నవతెలంగాణ – హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా గత కొన్ని రోజులుగా సిబ్బంది, ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడం కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ సిటీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డీకపూల్‌లో హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు డ్రైవర్, కండక్టర్‌తో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES