నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘేల్ ఈరోజు శ్రీజ మహిళా పాల ఉత్పత్తి సంస్థను సందర్శించారు. స్థానిక పాల ఉత్పత్తిదారులతో విస్తృత స్థాయి చర్చలు జరిపిన ఆయన శ్రీజ సంస్థ యొక్క కార్యాచరణ విధానాలను పరిశీలించారు. అద్భుతమైన ఆర్థిక మైలురాళ్లను సాధించిన మహిళా వ్యవస్థాపకులు – ‘లఖ్‌పతి దీదీస్’ను ఆయన ఈ సందర్భంగా సత్కరించారు. గ్రామీణ ఆర్థిక పరివర్తనకు వారి అసాధారణ తోడ్పాటును ప్రశంసించారు. ఈ ప్రాంతంలో మహిళలను శక్తివంతం చేయడంలో, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషించినందుకు శ్రీజ ఎంపిఓ ను ప్రొఫెసర్ బాఘేల్ ప్రశంచించారు.
గ్రామీణ జీవనోపాధి యొక్క వైవిధ్యీకరణ
ఆర్థిక వైవిధ్యీకరణ యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పిన గౌరవనీయ మంత్రి , సాంప్రదాయ పాడిపరిశ్రమకు మించి కోళ్ల పెంపకం, ఆక్వాకల్చర్ , పందుల పెంపకం వరకు మహిళల వ్యవస్థాపక కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు. ఈ వ్యూహాత్మక వైవిధ్యీకరణ ఆదాయ భద్రతను పెంచుతుందని , మార్కెట్ అస్థిరతలకు వ్యతిరేకంగా స్థిరత్వంను మెరుగు పరుస్తుందని పేర్కొన్నారు.
వ్యవసాయ ఆధునీకరణ కార్యక్రమాలు
సమకాలీన వ్యవసాయ సాంకేతికతలను, ముఖ్యంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్‌తో సహా సూక్ష్మ-నీటిపారుదల వ్యవస్థలను స్వీకరించటం యొక్క ప్రాముఖ్యతను మంత్రి నొక్కిచెప్పారు. ఈ తరహా ఆధునిక సాంకేతిక జోడింపులు నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతాయని, తద్వారా గ్రామీణ మహిళా వ్యవస్థాపకుల ఆర్థిక పునాదిని బలోపేతం చేస్తాయని ఆయన అభిలషించారు.
సామాజిక అభివృద్ధి మరియు పాలన భాగస్వామ్యం
మానవ మూలధన అభివృద్ధి యొక్క అత్యున్నత ప్రాముఖ్యతను తెలిపిన మంత్రి బాఘేల్ , స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అంతేకాకుండా, పంచాయతీరాజ్ సంస్థల ద్వారా స్థానిక పాలనలో మహిళలు చురుకుగా పాల్గొనాల్సిందిగా ప్రోత్సహించారు, ప్రాధమిక స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియలు , సమాజ అభివృద్ధి కార్యక్రమాలలో వారి కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు.
వ్యవస్థాపక శ్రేష్ఠతకు గుర్తింపు
మహిళలు నేతృత్వంలోని అభివృద్ధి కార్యక్రమాలకు, పాడి పరిశ్రమ రంగంలో భారతదేశ సహకార ఉద్యమం యొక్క పురోగతి పట్ల ప్రభుత్వం యొక్క అచంచలమైన నిబద్ధతను ఈ పర్యటన నొక్కి చెబుతుంది.