నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రంలో, గోవిందరావుపేట కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చింత క్రాంతి కుమారుడి ధోతీ(పంచ) వేడుకకు ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై ఆశీర్వదించారు. జ్యోతి ఫంక్షన్ అనేది ఒక సాంప్రదాయ భారతీయ వేడుక అని అభివర్ణించారు. ఒక బాలుడికి మొదటిసారిగా ధోతి ధరించడం ద్వారా అతని బాల్య దశ నుండి యుక్త వయసుకు మార్పును సూచిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్, సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరిల వెంకన్న , గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, మహిళా అధ్యక్షురాలు కళ్యాణి, నాయకులు రాజిరెడ్డి, సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యూత్ అధ్యక్షులు చింత క్రాంతి కుమారుడి “దోతీ ఫంక్షన్” కు హాజరైన మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES