నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం(పిటి) గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొర్నెబెల్లి సూర్యనారాయణ మాజీ ఎంపిటిసి, కుమారుడు కొర్నెబెల్లి సందీప్-హరిక ల వివాహానికి ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గత నాలుగు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన వివాహ జంటను కూడా ఆశీర్వదించారు. వారు కలకాలం సకల ఐశ్వర్యాలతో కలకాలం విరజిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంధాలయ చైర్మన్ రవి చందర్, కిసాన్ సెల్ అధ్యక్షులు రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ఉత్సవ కమిటీ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగా కళ్యాణి, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, నాయకులు పీరీల వెంకన్న, చాంద్ పాషా, సీతక్క యువసేన అధ్యక్షులు సర్ప రవీందర్, వావిలాల రాంబాబు శ్రీకాంత్, బండారి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వివాహ శుభకార్యానికి హాజరైన మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES