Thursday, May 15, 2025
Homeజిల్లాలుమేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క

మేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క

- Advertisement -

ప్రత్యేక మొక్కలు చెల్లింపు..
నవతెలంగాణ – తాడ్వాయి 
: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను, తెలంగాణ పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం దర్శించుకున్నారు. మేడారంలో సీతక్క కు గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలువాయిద్యాలతో ఆదివాసి సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పసుపు కుంకుమ చీర సారెతో పాటు, తులాభారం వేసుకోని నిలువెత్తు బంగారం ( బెల్లం) కూడా సమర్పించి వనదేవతలకు సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, టీపీసీసీ సబ్యులు మల్లాడి రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, బ్లాక్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మేడారం ఉత్సవ కమిటీ చైర్మన్ లచ్చు పటేల్,  తాడ్వాయి సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు కళ్యాణి, మాజీ సర్పంచ్ సునీల్ దొర, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -