Tuesday, January 20, 2026
E-PAPER
Homeజిల్లాలుయాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జిగా రానున్న మంత్రి సీతక్క..

యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జిగా రానున్న మంత్రి సీతక్క..

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం
ఎక్స్ అఫీషియో ఓట్లతో  కాంగ్రెస్ చైర్మన్లే విజయం
నవతెలంగాణ – ఆలేరు 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న మున్సిపల్ చైర్మన్ స్థానాలు పాటు అత్యధిక కౌన్సిలర్లను గెలుపొందేందుకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ క్యాబినెట్ మంత్రి సీతక్కను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాలు గెలిచే దిశగా ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డిలతో కలిసి కౌన్సిలర్లుగా ఎవరు అయితే గెలుస్తారో వాళ్ళని నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వాన్ని సమన్వపరిచేందుకు రెండు మూడు రోజుల్లో సమావేశం కానున్నట్లు తెలిసింది.

2019లో బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ సవరణ చట్టం ద్వారా పదవిరీత్య ఓటు వేసే అధికారం ఉన్న ప్రజా ప్రతినిధి (Ex officials ,)ఎం.పీ ,ఎమ్మెల్యే ఎమ్మెల్సీ) ఓట్లను ఉపయోగించి జిల్లాలో ఉన్న అన్ని మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకున్నందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. కేసీఆర్ తెచ్చిన ఈ చట్టం  కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. జిల్లాలో ఉన్న అన్ని స్థానాలు సులువుగా కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -