Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

మహిళా దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆవిష్కరించారు. మార్చి 6న జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు మంత్రిని ఆహ్వానించారు. అనంతరం ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ఆమె దష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్‌, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ దీపారెడ్డి, కోశాధికారి జి.శాంతిశ్రీ, శిరీష, సంతోష్‌, జయశ్రీ, రేవతి, చైతన్య, రమాదేవి, అలివేలు, సైదమ్మ, అనిత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -