- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు జైపాల్ రెడ్డి తండ్రి శనివారం అకాల మరణం చెందారు. ఈ విషయం తెలిసిన అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చేరుకున్నారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి సీతక్క, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -