మండల అధ్యక్షులు నరేష్ నాయక్
నవతెలంగాణ – మిడ్జిల్
మక్తల్లో ఎస్టీ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యకు మంత్రి వాకిటి శ్రీహరి కారణమని మరణానికి ఆయననే బాధ్యత వహించాలని మిడ్జిల్ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ఎస్టీ నాయకుడిని బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్పను మంత్రి శ్రీహరి, ఆయన అనుచరులు మానసికంగా ఆయన పై దాడి చేసి మహాదేవప్ప మృతి కి కారణం అయ్యారని అన్నారు.గిరిజన అభ్యర్థిపై మాఫియా రాజకీయాలతో ఒక నిండు ప్రాణం బలైపోయిందని వాపోయారు. మహాదేవప్ప మృతిపై విచారణ చేసి ఆయన మరణాానికిి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు, పునరావితం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దౌర్జన్యం, రౌడీ రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీ కి కొత్తేం కాదు.ఓడిపోతమనే భయంతో ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘాతుకానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడటం దారుణం అని మండి పడ్డారు. జిల్లా పోలీసు యంత్రాంగం న్యాయబద్ధంగా విచారణ చేపట్టి మనరానికి కారణమైన ఎవ్వరు కూడా వదిలిపెట్టట వద్ద అని కోరారు.



