Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలుసురవరం మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు

సురవరం మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అకాల మరణం తీవ్ర బాధాకరమని, ఆయన మృతి సిపిఐ పార్టీకి తీరని లోటని మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఒక దృఢమైన పోరాట యోధుడు ఆయన అని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి తన జీవితాన్ని సురవరం అంకితం చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -