Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి భౌతికకాయానికి మంత్రి శ్రీధర్‌ బాబు నివాళి

మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి భౌతికకాయానికి మంత్రి శ్రీధర్‌ బాబు నివాళి

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి
మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి భౌతికకాయాన్ని మంథని పట్టణానికి తీసుకొచ్చారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్‌బాబు గురువారం సందర్శించి భౌతికకాయంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులకు సునీల్‌ రెడ్డి, అనిల్‌ రెడ్డి తదితరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాంరెడ్డి గ్రామ సర్పంచ్‌గా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్‌, మాజీ ఎంపీపీ కొండా శంకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కుడుదుల వెంకన్న, నాయకులు ముసుకుల సురేందర్‌ రెడ్డి తదితరులు రాంరెడ్డికి నివాళులర్పించారు.

నివాళులర్పించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి భౌతికకాయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి, అనిల్‌ రెడ్డి, కుటుంబీకులను పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -