Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేదలకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

పేదలకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

బాధితురాలుకు రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత..
నవతెలంగాణ – మల్హర్ రావు
: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసిలు ఇప్పిస్తూ భరోసాగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని ఆన్సన్ పల్లి గ్రామానికి చెందిన భూక్య మాధురి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరగా ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకపోయారు. స్పందించిన మంత్రి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2,50,000 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. శనివారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సహయకుడితో ఎల్ఓసి పత్రాన్ని ఇప్పించారు. అడగగానే తమకు అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad