చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్ఓసి మంజూరు
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద రోగులకు వైద్యం కోసం సిఎంఆర్ఏప్ నుంచి ఏల్ఓసిలు మంజూరు చేయిస్తూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు బాధితులకు అండగా నిలుస్తున్నారు. మండలంలోని పెద్దతూoడ్ల గ్రామపరిదిలోని గాదంపల్లికి చెందిన పుప్పాల రమేష్ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చుల సహాయం కోసం బాధితుని కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకపోయారు. స్పందించిన మంత్రి వెంటనే బాధితుని చికిత్స ఖర్చల కోసం రూ.2.50 లక్షల ఏల్ఓసి మంజూరు చేయించి మంత్రి సహాయకులతో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఇందుకు మంత్రికి బాధితుని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పేదలకు అండగా నిలుస్తున్న మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



