నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసిలు మంజూరు చేసాయిస్తూ పేదలకు రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంథని నియోజకవర్గంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదరీ కోమలత అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య సహాయం కోసం బాధిత కుటుంబం మంత్రి శ్రీదర్ బాబుకు విన్నవించారు. ఇందుకు మంత్రి వెంటనే స్పందించి సిఎంఆర్ఏప్ ద్వారా రూ.2 లక్షల ఏల్ఓసిని మంజూరు చేయించి బుధవారం మంత్రి సహాయకుడితో హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో అందజేశారు. ఇందుకు మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తున్న మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES