Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖర్గేను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.!

ఖర్గేను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.!

- Advertisement -

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.
నవతెలంగాణ – మల్హర్ రావు:

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు.ఖర్గే కు ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని, పూర్తి ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆయన మార్గదర్శకత్వం అత్యంత అవసరమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -