Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం దేవరాంపల్లి (రేగులాగూడెం గ్రామపంచాయతీ) గ్రామ ప్రజలు,రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు మంగళవారం దేవరాంపల్లి ప్రధాన కూడలి వద్ద ఐటీ పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్డురి లక్ష్మణ్ కుమార్ సంక్షేమ శాఖ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవరాంపల్లి నుండి ఎడ్లపల్లి వరకు రూ.4.45 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నిధులను విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ నుండి నిధులు విడుదల చేసినందు కు గ్రామ రైతులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల- సమ్మయ్య స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి,జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు ఓన్న వంశవర్ధన్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిల్లమారి రమేష్, రేగులాగూడెం మాజీ సర్పంచ్ అయిలినేని నవీన్ రావు, గంధం బాలరాజు, పాగే సురేష్, నూకల సారయ్య,కుమ్మరి నగేష్, పిల్లమరి నరేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad